ఆసియా పారా గేమ్స్‌‌‌‌లో 82 పతకాలతో చరిత్ర

 ఆసియా పారా గేమ్స్‌‌‌‌లో 82 పతకాలతో చరిత్ర

హాంగ్జౌ: ఆసియా పారా గేమ్స్‌‌‌‌లో ఇండియా పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 82 (18 గోల్డ్‌‌‌‌, 23 సిల్వర్‌‌‌‌, 41 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌ నెగ్గారు. దీంతో 2018 ఇండోనేసియాలో  నెగ్గిన 72 పతకాల రికార్డును బ్రేక్‌‌‌‌ చేశారు. గురువారం నాలుగో రోజు పోటీల్లో సచిన్‌‌‌‌ సర్జెరావు ఖిలారి స్వర్ణంతో మెరిశాడు. మెన్స్‌‌‌‌ ఎఫ్‌‌‌‌–46 షాట్‌‌‌‌పుట్‌‌‌‌లో గేమ్స్‌‌‌‌ రికార్డు త్రో 16.03 మీటర్ల దూరంతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు.

రోహిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ 14.56 మీటర్లతో బ్రాంజ్‌‌‌‌ను సాధించాడు. ఆర్‌‌‌‌6 మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ 50 మీ. రైఫిల్‌‌‌‌ ప్రోన్‌‌‌‌ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌1లో సిద్ధార్థ్‌‌‌‌ బాబు 247.7 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. కాంపౌండ్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్​ టీమ్‌‌‌‌ ఆర్చరీ ఈవెంట్‌‌‌‌లో శీతల్‌‌‌‌ దేవి, రాకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ 151–149తో లిన్‌‌‌‌ యుషెన్‌‌‌‌–జిన్‌‌‌‌లియాంగ్‌‌‌‌ (చైనా)ను ఓడించి బంగారు మెడల్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఆర్చరీలో అదిల్‌‌‌‌ మహ్మద్‌‌‌‌–నవీన్‌‌‌‌ దలాల్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ను గెలిచారు. విమెన్స్‌‌‌‌ టీ12, 100 మీటర్లలో సిమ్రాన్‌‌‌‌, ఎఫ్‌‌‌‌34 షాట్‌‌‌‌పుట్‌‌‌‌లో భాగ్యశ్రీ సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను నెగ్గారు.