
న్యూఢిల్లీ: ఇండియా పారా షట్లర్లు.. చైనా పారా బ్యాడ్మింటన్‌ఇంటర్నేషనల్‌టోర్నీలో సత్తా చాటారు. ప్రమోద్‌భగత్‌గోల్డ్, సిల్వర్‌మెడల్‌తో మెరిస్తే, సుకాంత్ కడమ్ రెండు రజతాలతో ఆకట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్–3 ఫైనల్లో ప్రమోద్ 15–21, 21–19, 21–16తో ముహ్ అల్ ఇమ్రాన్ (ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణం సాధించాడు. దాదాపు 18 నెలల తర్వాత ప్రమోద్‌కు ఇది తొలి బంగారు పతకం కావడం విశేషం. ‘ఎప్పుడు.. ఎక్కడ’ అనే డోపింగ్రూల్ను మూడుసార్లు ఉల్లంఘించడంతో ప్రమోద్‌పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు.
ఆ ఒత్తిడి నుంచి బయటపడి మళ్లీ పతకం గెలవడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఎస్‌ఎల్–4 కేటగిరీ ఫైనల్లో సుకాంత్ కడమ్ 9–21, 8–21తో లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. మెన్స్ డబుల్స్ ఫైనల్లో ప్రమోద్ భగత్–సుకాంత్ కడమ్ 18–21, 22–20, 18–21తో జగదీశ్ ఢిలీ–నవీన్ శివకుమార్ చేతిలో పరాజయం పాలై సిల్వర్‌తో సంతృప్తి పడ్డారు. మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎహెచ్–6 ఫైనల్లో కృష్ణ నగర్ 22–20, 7–21, 17–21తో నటాపోంగ్ మీచాయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి సిల్వర్‌కు పరిమితమయ్యాడు.