రైల్వే టీ బిల్లు ఫొటో వైరల్

రైల్వే టీ బిల్లు ఫొటో వైరల్

న్యూఢిల్లీ: ఇండియన్​రైల్వే 20 రూపాయల చాయ్​కి 50 రూపాయల ట్యాక్స్​వేసిందని ఓ ప్రయాణికుడు సోషల్​మీడియాలో పెట్టిన పోస్ట్​వైరల్​గా మారింది. తాను జూన్​28న శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో ఢిల్లీ నుంచి భోపాల్ కు వెళ్తూ చాయ్​తాగగా, దానికి ఇండియన్​రైల్వే రూ.20 టీకి, రూ.50 ట్యాక్స్​మొత్తం రూ.70 తన వద్ద నుంచి వసూలు చేసిందని పేర్కొంటూ.. ఆ బిల్లు ఇన్​వాయిస్​సోషల్​మీడియాలో షేర్​చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించడంతో అది వైరల్​గా మారింది. కాగా రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణికుడు భోజనం బుక్ చేయకుండా ఉండి, ఆన్​బోర్డులో ట్రెయిన్​వెళ్తున్న టైమ్​లో టీ, కాఫీ లేదా భోజనం ఆర్డర్ చేస్తే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాలని 2018లో ఇండియన్​రైల్వేస్​ఓ సర్క్యూలర్ జారీ చేసింది.