వీడని పొగమంచు.. 36 రైళ్లు ఆలస్యం

వీడని పొగమంచు.. 36 రైళ్లు ఆలస్యం

నార్త్ ఇండియాను పొగమంచు వీడటం లేదు. గత ఐదు రోజులగా పొగమంచు కప్పేస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది. పలు ఫ్లైట్స్, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి.  కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ  ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల విజిబులిటీ భారీగా తగ్గింది. దీంతో 36 రైళ్లు గంట నుంచి  ఐదున్నర గంటల వరకు ఆలస్యంగా నడుస్తాయని నార్తిండియా రైల్వే ప్రతినిధి ప్రకటించారు.  ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల జాబితాను ప్రకటించింది.

ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల జాబితా

  • పూరీ - న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్
  • బటిండా గోరఖ్‌పూర్ గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్
  • దర్భంగా- న్యూ ఢిల్లీ బీహార్ సమపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  • బాంద్రా టెర్మినస్ - శ్రీ మాతా వైష్ణో దేవి కర్తా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్ - న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రాణి కమలపాటి న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్
  • రాజ్‌గిర్ - న్యూఢిల్లీ శర్మజీవి ఎక్స్‌ప్రెస్
  • మాల్దా టౌన్ - ఢిల్లీ ఎక్స్‌ప్రెస్
  • బరౌని న్యూ ఢిల్లీ క్లోన్ స్పెషల్
  • కాన్పూర్ సెంట్రల్ న్యూఢిల్లీ శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్
  • హౌరా-న్యూ ఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్
  • సహర్సా - న్యూ ఢిల్లీ వైశాలి ఎక్స్‌ప్రెస్
  • రేవా ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్- న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్
  • అజంగఢ్ ఢిల్లీ కైఫియాత్ ఎక్స్‌ప్రెస్
  • భాగల్పూర్- ఆనంద్ విహార్ టెర్మినల్ విక్రమశిల ఎక్స్‌ప్రెస్
  • రాజేంద్ర నగర్ టెర్మైన్- న్యూ ఢిల్లీ సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  • కామాఖ్య- ఢిల్లీ బ్రహ్మపుత్ర మెయిల్
  • ఉదయపూర్ సిటీ యోగ్ నగరి రిషికేష్ ఎక్స్‌ప్రెస్
  • జమ్ము తావి- అజ్మీర్ పూజా ఎక్స్‌ప్రెస్
  • ప్రయాగ్‌రాజ్- ఆనంద్ విహార్ టెర్మినల్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్
  • విశాఖపట్నం- న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్
  • ప్రతాప్‌గఢ్-ఢిల్లీ పద్మావత్ ఎక్స్‌ప్రెస్
  • రాజ్‌గిర్ న్యూఢిల్లీ శర్మజీవి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • రక్సాల్- ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్
  • ప్రతాప్‌గఢ్- ఢిల్లీ పద్మావత్ ఎక్స్‌ప్రెస్
  • లక్నో- న్యూ ఢిల్లీ మెయిల్
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
  • జబల్పూర్ హజ్రత్ నిజాముద్దీన్ గోండ్వానా ఎక్స్‌ప్రెస్
  • డాక్టర్ అంబేద్కర్ నగర్ శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • MGR చెన్నై సెంట్రల్- న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్
  • హైదరాబాద్ దక్కన్ నామోల్లీ- న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్
  • అమృత్‌సర్ బిలాస్‌పూర్ ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్
  • అమృతసర్ ముంబై సెంట్రల్ గోల్డెన్ టెంపుల్ మెయిల్