ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు

ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు

కరోనా సోకిన వారి కోసం అసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి..వారిని అందులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ రాష్ట్రంలో అసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ఇండియాలోని పలు ప్రాంతాల్లో రైల్వే బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చాలని రైల్వే బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి జోనల్‌ రైల్వే మేనేజర్లందరికీ కేంద్రం లేఖలు రాసింది. మొదటి దశలో 5000 రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత 20 వేల వరకూ బోగీలను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ఆదేశిస్తూ, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరింది.

ఆర్మ్‌ డ్‌ ఫోర్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తోపాటు వేర్వేరు రైల్వే జోన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే నమూనా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేశామని బోర్డు తెలిపింది. నాన్‌ ఏసీ, స్లీపర్‌ బోగీలను మాత్రమే అసోలేషన్ వార్డులుగా మారుస్తున్నామని చెప్పింది.