యూజర్ డేటా సేఫ్.. హ్యాక్ చేసే ఛాన్సే లేదు : ఇండియన్ రైల్వే 

యూజర్ డేటా సేఫ్.. హ్యాక్ చేసే ఛాన్సే లేదు : ఇండియన్ రైల్వే 

ఐఆర్‌సీటీసీ సర్వర్ల నుంచి గత కొంతకాలంగా వినియోగదారుల డేటా దొంగిలిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఇండియన్ రైల్వే స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, డేటా అంతా భద్రంగా ఉందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. యూజర్ల డేటా అంతా హాకర్ల చేతిలో ఉందని, దాన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టారనే విషయాలు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇండియన్ రైల్వేస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ స్పందించింది.

యూజర్ డేటా లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా) తెలిపింది. అయితే, డేటా దొంగిలించేందుకు ఎలాంటి ఆస్కారం లేదని, కట్టుదిట్టమైన భద్రత ఉందని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకున్న 30 మిలియన్ మంది డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ డేటా దొంగిలించడితే హ్యాకర్ల చేతికి యూజర్ ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామా, వయసు, లింగంతో కూడిన వ్యక్తిగత సమాచారమంతా వెళ్తుంది.