51 గంటల్లోనే బాలాసోర్ లో పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు

51 గంటల్లోనే బాలాసోర్ లో పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు

ఒడిశా విషాద ఘటన తర్వాత బాలాసోర్  ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. జూన్ 4న రాత్రి గూడ్స్ రైలును పరీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం ప్యాసింజర్ రైలును ట్రాక్ పై  నడిపారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే యుద్ధప్రాతిపదకన తిరిగి ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో  ట్రాక్ అందుబాటులోకి రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

జూన్ 2న రాత్రి బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీ కొని 288 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రెండు లైన్లలో సాధారణ రైలు సేవలు పునరుద్ధరించబడ్డాయని  కేంద్రమంత్రి  అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైష్ణవ్ ఎలక్ట్రానిక్  ఇంటర్ లాకింగ్ లో మార్పుల వల్లే రైలు ప్రమాదం జరిగిందని ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1665540971315236866