ఇకపై రైల్వే ఫిర్యాదులకు ఒకే నెంబర్ 139

ఇకపై రైల్వే ఫిర్యాదులకు ఒకే నెంబర్ 139

రైల్వే ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్ల సమస్యను సులభతరం చేసింది. ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా.. హెల్ప్‌లైన్‌ నంబర్లన్నింటినీ 139లో కలిపేసింది.గతంలో ప్రయాణికులు తమ సమస్యలపై వేర్వేరు హెల్ప్‌లైన్‌ నంబర్లతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి 139కు డయల్‌ చేయవచ్చు.

182 మినహా ప్రస్తుతం ఉన్న అన్ని నంబర్లూ 139 లోకి వెళ్లిపోతాయి. రైల్వే భద్రతా సేవల కోసం మాత్రం 182 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ 139 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ప్రయాణికుల ఫిర్యాదులపై స్పందించేందుకు 12 భాషల్లో అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (IVRS) ఆధారంగా ఇది పని చేస్తుంది. ఏ ఫోన్‌ నుంచైనా 139కి కాల్‌ చేసి ఫిర్యాదులు చేయవచ్చని రైల్వే శాఖ చెప్పింది.