
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ. 10 ఉండగా.. దీన్ని రూ. 50లకు పెంచినట్లు తెలిపింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉంటాయని చెప్పింది. కరోనా సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది.