రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

కరోనా ఎఫెక్ట్ భారత్ దేశంలో అన్ని రంగాలపై పడింది. రైల్వే శాఖపై కూడా కరోనా తన ప్రభావం భారీగానే చూపింది. దీంతో అటు సంస్థతో పాటు.. ఇటు ప్రయాణికులపై కూడా అదనపు భారీ పడింది. కరోనా కారణంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లను భారీగా పెంచారు. స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే.. ఈ మేరకు అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే స్టేషన్ లలో ప్లాట్ ఫామ్ ధరలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తగ్గించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 250 రైల్వే స్టేషన్ లో ఈ నిర్ణయం అమలు అవుతుందని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది.

దీని వల్ల ఇప్పటి నుంచి ప్లాట్ ఫామ్ ధర రూ. 10 మాత్రమే ఉంటుంది. అయితే గతంలో కూడా ప్లాట్ ఫాం ధర రూ. 10 మాత్రమే ఉండేది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి సమయం లో రైల్వే స్టేషన్ ల లో రద్దీ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాట్ ఫామ్ ధరల ను విపరీతం గా పెంచింది. దాదాపు 400 శాతం పెంచి ప్లాట్ ఫాం ధరను రూ.10 నుంచి రూ. 50 వరకు పెంచింది. ఈ నిర్ణయం తో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనేక నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా ప్లాట్ ఫాం ధర ను రూ. 50 నుంచి తిరిగి రూ. 10 కి తగ్గించింది. కాగ ప్లాట్ ఫాం ధరలు యాధాస్థితికి రావడంతో రైల్వే ప్రయాణికులు కాస్త ఊరట పొందుతున్నారు.