వందే భారత్ తరహాలో వందే మెట్రో

వందే భారత్ తరహాలో వందే మెట్రో

వందే భారత్ రైళ్ల తరహాలో వందే మెట్రో సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వందేభారత్ మెట్రో రైళ్లు మినీ వెర్షన్ అని ఆయన చెప్పారు. ఈ ఏడాది రైళ్ల తయారీ పూర్తి చేసి వచ్చే ఏడాది వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని  అన్నారు. స్వస్థలాల నుంచి సిటీలోకి వచ్చే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. వందే భారత్‌ రైళ్లలో 16 బోగీలుండగా.. వందే మెట్రో 8 బోగీలతో నడవనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రైల్వేలకు రూ.2.42లక్షల కోట్లు కేటాయించింది.  గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం రూ.లక్ష కోట్లు ఎక్కువ.