ఇండియా షూటర్..ఆషికి సిల్వర్

ఇండియా షూటర్..ఆషికి సిల్వర్

న్యూఢిల్లీ :  ఇండియా షూటర్, ఆసియా గేమ్స్ మెడలిస్ట్‌‌ ఆషి చౌక్సే పోలిష్‌‌ గ్రాండ్ ప్రి  టోర్నీలో సిల్వర్‌‌‌‌తో మెరిసింది. పోలాండ్‌‌లోని వ్రోక్లాలో శనివారం జరిగిన విమెన్స్‌‌ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో ఆషి 464.7 స్కోరుతో రెండో స్థానం సాధించింది. మరో ఇండియన్‌‌ సిఫ్ట్‌‌ కౌర్‌‌ నాలుగో ప్లేస్‌‌లో నిలిచి కొద్దిలో బ్రాంజ్ కోల్పోయింది. అంజుమ్‌‌ మౌద్గిల్‌‌ ఏడో ప్లేస్‌‌తో సరిపెట్టింది.