యూఎస్‌‌‌‌ ఓపెన్‌ రన్నరప్‌‌‌‌గా కిడాంబి శ్రీకాంత్‌‌‌‌

యూఎస్‌‌‌‌ ఓపెన్‌ రన్నరప్‌‌‌‌గా కిడాంబి శ్రీకాంత్‌‌‌‌

పుల్లర్‌‌‌‌టాన్‌‌‌‌ (అమెరికా): ఇండియా స్టార్ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో రన్నరప్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో శ్రీకాంత్‌‌‌‌ 15–21, 21–16, 9–21తో సు లీయాంగ్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌‌‌‌ కోల్పోయినా.. రెండో గేమ్‌‌‌‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. 

కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌‌‌‌లో ప్రత్యర్థి వేగాన్ని అందుకోలేకపోయాడు. లియాంగ్‌‌‌‌ కొట్టిన క్రాస్‌‌‌‌ కోర్టు షాట్లు, ర్యాలీలు తీయడానికి ఇబ్బందిపడ్డాడు. 1–4తో వెనకబడిన శ్రీ ఏ దశలోనూ పుంజుకోలేకపోయాడు. 15–7 లీడ్‌‌‌‌లో నిలిచిన లీయాంగ్‌‌‌‌ వెనుదిరిగి చూసుకోలేదు.