లండన్: ఇటలీ స్టార్ ప్లేయర్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో బోణీ చేశాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్‌సీడ్ సినర్ 4–6, 6–3, 6–7 (6/8), 6–2, 6–3తో కెమినోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో సినర్ బలమైన సర్వీస్‌లు, బేస్ లైన్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో చివరి రెండు సెట్లలో ఏకపక్షంగా దూసుకుపోయాడు. మరో మ్యాచ్‌లో కాస్పర్ రుడ్ (నార్వే) 4–6, 2–6, 6–7 (7/9)తో హుర్కాజ్ (పోలెండ్) చేతిలో ఓడాడు.
టొమ్మి పాల్ (అమెరికా) 6–1, 6–2, 6–1తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. విమెన్స్ సింగిల్స్‌లో పెగులా (అమెరికా) 7–5, 6–3తో విడ్మనోవా (చెక్)పై, జెంగ్ (అమెరికా) 6–7 (7/9), 6–2, 6–7 (2/7), 6–3, 7–6 (10/4)తో నోరి (ఆస్ట్రేలియా)పై, నవోమి ఒసాకా (జపాన్) 6–1, 7–5తో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్)పై, బెనిసిచ్ (కెనడా) 6–2, 6–1తో స్టోసావిలిసిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
