భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా వాల్‌స్ట్రీట్ మార్కెట్ ప్రభావం ఆసియన్ మార్కెట్లపై పడింది. వాల్‌స్ట్రీట్ నష్టాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. వాల్ స్ట్రీట్ మార్కెట్ పడిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1070 పాయింట్ల నష్టంతో 50,184.60 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 310 పాయింట్ల నష్టంతో 14,800 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయం మూడో క్వార్ట‌ర్‌కు సంబంధించిన జీడీపీని విడుదల చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాటపట్టాయి. దాంతో ట్రేడర్లు అందరూ తలలు పట్టుకున్నారు.