థేమ్స్ నదిలో భారతీయ విద్యార్థి డెడ్​బాడీ లభ్యం

థేమ్స్ నదిలో భారతీయ విద్యార్థి డెడ్​బాడీ లభ్యం

లండన్ : గత నెలలో లండన్ లో అదృశ్యమైన 23 ఏండ్ల భారతీయ విద్యార్థి మిత్‌ కుమార్ పటేల్ అక్కడి థేమ్స్ నదిలో శవమై తేలాడు. మిత్‌కుమార్.. ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్ 19న యూకే వెళ్లాడు. నవంబర్ 17న అతను మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో అతడు తప్పిపోయినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ వద్ద థేమ్స్ నదిలో మిత్ కుమార్ డెడ్ బాడీని కనుగొన్నారు.