గుడ్న్యూస్: సింగపూర్లో కూడా PhonPe పేమెంట్స్ చేయొచ్చు

గుడ్న్యూస్: సింగపూర్లో కూడా PhonPe పేమెంట్స్ చేయొచ్చు

PhonePe in Singapore: ఇండియన్ టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇవాల్టినుంచి అంటే ఏప్రిల్7, 2024 నుంచి సింగపూర్లో PhonePe యూపీఐ ఉపయోగించి ఆన్లైన్  చెల్లింపులు చేయొచ్చు. సింగపూర్ టూరిజం బోర్డుతో ఫోన్ పే కంపెనీ ఒప్పందం ప్రకారం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సింగూపూర్, భారత్ మధ్య యూపిఐ కనెక్షన్ ఆధారంగా ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాలనుంచి భారత్, సింగపూర్ దేశాల మధ్య తక్షణమే డబ్బు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. సింగపూర్ లోని భారతీయ సందర్శకుల కోసం  UPI చెల్లింపులను ప్రోత్సహించేందుకు సింగపూర్ టూరిజం బోర్డు(  STB) , PhonePe రెండు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 

సింగపూర్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో నిరంతరాయంగా UPI  సేవలను అందించేందుకు 8వేల మంది వ్యాపారులకు తక్షణమే సురక్షితమైన చెల్లింపులు చేయడానికి భారతీయ టూరిస్టులకు అనుమతినిస్తుంది. ఒప్పందం ప్రకారం..QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలనుంచి నేరుగా చెల్లింపులు చేయవచ్చు.