ఫోన్లకు అతుక్కుపోకుండా ఆ ఊళ్లో కొత్త రూల్

ఫోన్లకు అతుక్కుపోకుండా ఆ ఊళ్లో కొత్త రూల్

మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే డిజిటల్ డీటాక్స్ ఒక్కటే దారి. రోజూ కాసేపు ఫోన్‌‌కు దూరంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ దాన్ని అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతుంటారు. అందుకే దీనికో సొల్యూషన్ కనిపెట్టాడు మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లాలోని వడగావ్ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే తన ఊరి వాళ్లు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోకుండా ఊళ్లో ఓ కొత్త రూల్ పెట్టాడు.

ఊళ్లోవాళ్లు రోజంతా డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోకుండా ఉండడం కోసం ‘డీటాక్స్ అవర్’ అనే కొత్త ప్రోగ్రామ్‌‌ తీసుకొచ్చాడు. డిజిటల్ డీటాక్స్‌‌ను గుర్తు చేస్తూ ఊళ్లో ప్రతిరోజూ రాత్రి ఏడు గంటలకు గుడిలో ఒక సైరన్ మోగుతుంది. అప్పుడు ఊళ్లో వాళ్లందరూ ఫోన్లు, టీవీలు ఆఫ్ చేయాలి. ఆ టైంలో కూర్చొని మాట్లాడుకోవడం లేదా పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. గంటన్నర తర్వాత 8:30 గంటలకు మళ్లీ సైరన్ మోగుతుంది. అక్కడితో డీటాక్స్ పీరియడ్ ముగుస్తుంది. ఇలా రోజూ జరుగుతుంది. మోహితే.. గ్రామసభ పెట్టి ఊళ్లో వాళ్లందరికీ ఈ ఐడియా చెప్పి ఒప్పించాడు. అలా అందరూ కలిసి ఓ సైరన్ అలారం కొని, ఈ ప్రోగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చారు.