మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొట్టుకున్న విద్యార్థులు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొట్టుకున్న విద్యార్థులు

నల్లగొండ:మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.బుధవారం(జూన్2) రాత్రి ఇంటిగ్రేటెడ్, పీజీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.మెస్ హాల్లో మొదలైన చిన్న గొడవ ముదిరి విద్యార్థులు దాడి చేసుకున్నారు.యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారలు జోక్యం చేసుకున్నా విద్యార్థులను అదుపు చేయలేకపోయారు.దీంతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

యూనివర్సిటీ మెస్ హాల్ లో బుధవారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. భోజనం సమయంలో ఇంటిగ్రేటెడ్ బైపీసీ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంకామ్ స్టూడెంట్ ని లైన్ రావాలని చెప్పడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. మాటమాట పెరిగి విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

నిబంధనల ప్రకారం.. యూనివర్సిటీ మెస్ నిర్వహణ ఒక్కో నెల ఒక్కో డిపార్ట్ మెంట్ కు బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం సైన్సు డిపార్టుమెంట్ విద్యార్థులు మెస్ నిర్వహణ చూసుకుంటున్న సమయంలో ఈ గొడవ తలెత్తింది. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు ఇరువర్గాలను అదుపు చేయడం కష్టం మారింది. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.