
లక్నో : ఇండియా యంగ్ షట్లర్ ప్రియాన్షు రజావత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీస్ చేరుకున్నాడు. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట కూడా ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో రజావత్ 21–15, 21–16తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా)ను వరుస గేమ్స్‌లో ఓడించాడు. విమెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో అశ్విని–తనీషా జంట 21–19, 21–8తో పుల్లెల గాయత్రి–ట్రీసా జోడీని ఓడించి సెమీస్‌లో అడుగు పెట్టింది.