వాషింగ్టన్: ఆమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు సలహాదారుగా మన దేశ మూలాలున్న శాంతి సేథీ అపాయింట్ అయ్యారు. యూఎస్ నేవీ యుద్ధ నౌకకు తొలి ఇండో–అమెరికన్ కమాండర్ అయిన సేథీని .. హారిస్‌కు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, డిఫెన్స్ అడ్వైజర్‌గా ఈ మధ్యే నియమించినట్లు సీనియర్ అడ్వైజర్ హెర్బీ జిస్కెండ్ మంగళవారం వెల్లడించారు. 1993లో యూఎస్ నేవీలో చేరిన సేథీ.. 2010 నుంచి 12 దాకా యూఎస్ డెకాటూర్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్‌కు నాయకత్వం వహించారు. మన దేశంలో పర్యటించిన యూఎస్ నేవీ మొదటి మహిళా కమాండర్‌గా ఆమె రికార్డుకెక్కారు. ఆమె తండ్రి 1960లలో ఇండియా నుంచి వెళ్లి యూఎస్‌లో సెటిల్ అయ్యారు.
