ఇండియా కూటమిదే గెలుపు : భట్టి విక్రమార్క

ఇండియా కూటమిదే గెలుపు : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫరీద్ కోట్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా, మిగిలిన వాళ్లంతా పేదవాళ్లుగా ఉండిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని విమర్శించారు. గత పదేండ్లలో అదానీ, అంబానీలే బాగుపడ్డారని ఆయన ఆరోపించారు. 

బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుందని, అప్పుడు దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండవని, ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయని, రిజర్వేషన్లనూ రద్దు చేస్తారన్నారు. ఈసారి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. గత పదేండ్లలో ఎన్నో హామీలిచ్చిన మోదీ.. వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ అబద్ధాలకోరని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.15 లక్షలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.