
ఇండియాలో తొలి ఉగ్రవాది ఓ హిందువేనని నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని దారుణంగా కాల్చి చంపిన నాధూరాం గాడ్సే, హిందూ మహాసభ నేతేనని, ఇండియాకు స్వతంత్రం వచ్చిన తరువాత తొలి టెర్రరిస్ట్ అతనేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’అని కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు