గోల్డ్ మెడలే లక్ష్యంగా డైమండ్ లీగ్ లో నీరజ్

గోల్డ్ మెడలే లక్ష్యంగా డైమండ్ లీగ్ లో నీరజ్

జ్యూరిచ్: భారత జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ బరిలో దిగనున్నాడు. స్విట్జర్ ల్యాండ్ లోని జ్యూరిచ్ లో ఇవాళ రాత్రి 11.50 గంటలకు జరిగే మ్యాచ్ లో గోల్డ్ మెడలే లక్ష్యంగా నీరజ్ బరిలో దిగనున్నాడు. గాయంతో నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉన్న తర్వాత జూలై చివర్లో లాసానె డైమండ్ లీగ్ లో గెలిచిన నీరజ్ ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యాడు. 2017, 2018 ఎడిషన్స్ లో ఫైనల్స్ ఆడినా... వరుసగా 7, 4 స్థానాలతో సరిపెట్టుకున్నాడు. ఇకపోతే.. డైమండ్ లీగ్ లో 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి.

13 సిరీస్ ల్లో పెర్ఫామెన్స్ ద్వారా అథ్లెట్లు.. ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్ ను డైమండ్ లీగ్ ఛాంపియన్ గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే  భారత్ నుంచి డైమండ్ లీగ్ ఛాంపియన్ అవ్వాలని చోప్రా ఆశిస్తున్నాడు. టైటిల్ గెలిస్తే.. సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది.