
కెంట్ : ఇండియా లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్.. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాబోయే సీజన్‌లో అతను కెంట్ తరఫున ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. రెడ్ బాల్ బౌలింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగుపర్చుకోవడానికి టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహా మేరకు అర్ష్‌దీప్ కౌంటీల వైపు మొగ్గాడు.
‘ఇంగ్లండ్‌లో రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. నా స్కిల్స్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కౌంటీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నా. కెంట్ తరఫున మంచి పెర్ఫామెన్స్ చేసేందుకు నా వంతు కృషి చేస్తా’ అని అర్ష్‌దీప్ పేర్కొన్నాడు. జూన్–జులై మొత్తం అర్ష్‌దీప్ ఇంగ్లండ్‌లోనే గడపనున్నాడు.