ఒక్క‌రోజులోనే 51వేల మంది డిశ్చార్జ్ : పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

ఒక్క‌రోజులోనే 51వేల మంది డిశ్చార్జ్ : పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో ఓవైపు క‌రోనా వైర‌స్ బాధితులు పెరిగిపోతుంటే..మ‌రోవైపు అదే స్థాయిలో వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఉండ‌డం కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్ లో క‌రోనా వైర‌స్ బాధితుల‌ రికవరీ రేటు 67.19 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.09 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వైర‌స్ సోకిన బాధితుల సంఖ్య 19ల‌క్ష‌ల దాట‌గా అందులో 12 ల‌క్ష‌ల 82వేల‌కు పైగా బాధితులు కోలుకున్నారు. 39 వేల 795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల 86 వేల 244 యాక్టివ్ కేసులున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.