2022లో ఇండియా షట్లర్ల జోరు

2022లో ఇండియా షట్లర్ల జోరు

ఈ ఇయర్‌‌‌‌ బ్యాడ్మింటన్​లో ఇండియా సరికొత్త సంచలనాలు సృష్టించింది. థామస్‌‌‌‌ కప్‌‌‌‌తో మొదలు పెడితే, కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఆరు మెడల్స్‌‌‌‌తో సిక్సర్‌‌‌‌ కొట్టిన రాకెట్‌‌‌‌ స్టార్లు 2022ని గుర్తుండిపోయేలా చేసుకున్నారు. పీవీ సింధు, శ్రీకాంత్​, ప్రణయ్​, లక్ష్యసేన్​, సాత్విక్, చిరాగ్ ఈ విజయాల్లో భాగం అయ్యారు.  గాయాలతో సగం సీజన్‌‌‌‌కు దూరమైనప్పటికీ స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌  సింధు తన జోరును కొనసాగించింది. సయ్యద్​ మోడీ ఇంటర్నేషనల్​, స్విస్​ ఓపెన్​ సూపర్​–350, సింగపూర్​ ఓపెన్​ సూపర్​–500 టైటిల్స్​ సాధించింది. బర్మింగ్​హామ్​ కామన్వెల్త్​లో గోల్డ్​ మెడల్​తో మెరిసి మురిసింది. చీలమండ గాయం వల్ల వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌, బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు  దూరం కావడంతో మరిన్ని మెడల్స్‌‌‌‌ తెచ్చే చాన్స్​ లేకుండాపోయింది. 

‘థామస్‌‌‌‌’తో తడాఖా

ప్రతిష్టాత్మక థామస్​ కప్ గెలవడం ఇండియన్ బ్యాడ్మింటన్​లో హిస్టారికల్​ మూమెంట్​ అయింది. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా వెనకబడిపోయిన ఇండియా​ మెన్స్​ టీమ్​ ఈసారి చైనా, ఇండోనేసియా కోటలను బద్దలుకొట్టింది. కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ కెప్టెన్సీలో ఫస్ట్​ టైమ్​ థామస్​ కప్​ గెలవడంతో పాటు ప్లేయర్లు ఆట స్థాయిని పెంచుకున్నారు. శ్రీకాంత్‌‌‌‌తో పాటు హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. యంగ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌ లక్ష్యసేన్​ తొలి సూపర్​–500 టైటిల్, ​కామన్వెల్త్‌‌‌‌ గోల్డ్​ మెడల్​తో పాటు,  రెండు వరల్డ్​ టూర్​ టైటిల్స్‌‌‌‌తో సత్తా చాటాడు. తొలిసారి కామన్వెల్త్‌‌‌‌ (గోల్డ్)​, వరల్డ్​ చాంపియన్​షిప్ ( బ్రాంజ్)తో పాటు మరో మూడు టైటిళ్లతో డబుల్స్‌‌‌‌ స్టార్స్‌‌‌‌ సాత్విక్​, చిరాగ్​మరింత పేరు తెచ్చుకున్నారు.   బర్మింగ్​హామ్ కామన్వెల్త్​లో ఇండియా షట్లర్లు ఓవరాల్‌‌‌‌గా మూడు గోల్డ్​ సహా 6 మెడల్స్ తో సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అయితే శ్రీకాంత్​ మాత్రం బ్రాంజ్​తో సరిపెట్టుకోవడమే లోటుగా అనిపించింది.  వ్యక్తిగత టైటిల్​ లేకున్నా ప్రణయ్ నిలకడైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్​ తన చివరి పోరులో ఒలింపిక్​ చాంప్​​, వరల్డ్​ నం.1 అక్సెల్సెన్‌‌‌‌​పై నెగ్గడం ప్రణయ్​ కెరీర్​లో మర్చిపోలేని విజయం. వరల్డ్‌‌‌‌ మాజీ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ సైనా, కశ్యప్‌‌‌‌, సాయి ప్రణీత్‌‌‌‌కు ఈ ఇయర్‌‌‌‌ కలిసిరాలేదు. 

జూనియర్ల జోరు..

2022లో జూనియర్​ షట్లర్లు కూడా జోరు చూపెట్టారు. వరల్డ్​ జూనియర్​ చాంపియన్​షిప్​లో శంకర్  సిల్వర్​ మెడల్​తో పాటు  బాయ్స్‌‌‌‌ ​లో నంబర్.1గా నిలిచాడు. తస్నిమ్​ మిర్​ గర్ల్స్​లో  నంబర్​వన్​ ర్యాంక్​ సాధించింది. 14 ఏండ్ల వయసులో ఉన్నతి హుడా బీడబ్ల్యూఎఫ్​ టైటిల్​ (ఒడిశా ఓపెన్)​ను గెలుచుకుంది.  పారిస్​ ఒలింపిక్స్​కు క్వాలిఫికేషన్స్​ మొదలుకానున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఇండియన్​ షట్లర్ల నుంచి మరిన్ని మెరుపులు ఆశించొచ్చు.

సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌కు కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంక్‌‌

ఇండియా డబుల్స్‌‌  స్టార్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌, చిరాగ్‌‌ షెట్టి కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంక్‌‌ అందుకున్నారు. రెండు ర్యాంక్‌‌లు మెరుగై  ఐదో ప్లేస్‌‌ సాధించారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో సీనియర్‌‌ షట్లర్‌‌ హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌11 నుంచి 9వ ప్లేస్‌‌కు చేరుకున్నాడు.  కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ చాంపియన్‌‌ లక్ష్యసేన్‌‌ ఏడో ర్యాంక్‌‌లో ఉండగా, కిడాంబి శ్రీకాంత్‌‌ ఓ ప్లేస్‌‌ మెరుగై 11వ ర్యాంక్‌‌కు చేరుకున్నాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌‌లో మార్పు లేదు. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ 20 నుంచి 18వ ప్లేస్‌‌ అందుకున్నారు.