యూఎస్‌‌ కంటే ఇండియాలోనే ఎక్కువ డిజిటల్‌‌ ట్రాన్సాక్షన్లు : ఎస్‌‌ జైశంకర్‌‌‌‌

యూఎస్‌‌ కంటే ఇండియాలోనే  ఎక్కువ డిజిటల్‌‌ ట్రాన్సాక్షన్లు :  ఎస్‌‌ జైశంకర్‌‌‌‌

న్యూఢిల్లీ: యూఎస్‌‌లో కంటే ఇండియాలోనే ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని ఎక్స్‌‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్‌‌ జైశంకర్‌‌‌‌ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా  క్యాష్‌‌లెస్‌‌ ట్రాన్సాక్షన్లు జరపుతున్నామని,  కొన్ని ఏరియాల్లో ఎంత వృద్ధి చెందామో చూడాలని అన్నారు. బికనీర్‌‌‌‌లో జరిగిన ఓ ఈవెంట్‌‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో 1,344 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి.

కిందటేడాది మార్చితో పోలిస్తే 40 శాతం పెరిగాయి. వాల్యూ పరంగా చూస్తే మార్చిలో రూ.19.78 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ప్రస్తుతం యూపీఐ ఫ్రాన్స్‌‌, యూఏఈ, సింగపూర్‌‌‌‌, భూటన్‌‌, నేపాల్‌‌, శ్రీలంక, మారిషస్‌‌లో కూడా అందుబాటులో ఉంది.