క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లీ, జడేజా

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లీ, జడేజా

న్యూఢిల్లీ :  ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2023 అవార్డుకు ఇండియా సూపర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా  పోటీ పడుతున్నారు. అవార్డు విన్నర్ కు ఇచ్చే సర్ గార్​ఫీల్డ్  సోబర్స్ ట్రోఫీ కోసం మొత్తం నలుగురు షార్ట్‌‌ లిస్ట్ అయ్యారు.  ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ కూడా రేసులో నిలిచారు. ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయ్యాడు. గతేడాది సూపర్ పెర్ఫామెన్స్ చేసిన కోహ్లీ తన కెరీర్ లో మూడోసారి గ్యారీ ఫీల్డ్  సోబర్స్ ట్రోఫీ ముంగిట నిలిచాడు.

వన్డేల్లో 50వ సెంచరీతో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను దాటిన అతను  వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు నెగ్గాడు. గతేడాది మొత్తం 2048 ఇంటర్నేషనల్ రన్స్ చేశాడు. వరల్డ్ కప్ లో 765 రన్స్ చేసిన కోహ్లీ.. ఒక ఎడిషన్ లో హయ్యెస్ట్ రన్స్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ ఇప్పటికే వన్డే క్రికెటర్ అవార్డుకూ నామినేట్ అయ్యడు.  మరోవైపు జడేజా గతేడాది మూడు ఫార్మాట్లలో 66 వికెట్లు పడగొట్టి, 613 రన్స్ చేశాడు.  

ఇక, కమిన్స్ తన పేస్  బౌలింగ్ తో పాటు సూపర్ కెప్టెన్సీతో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ తో పాటు వరల్డ్ కప్ గెలిచాడు.  డబ్ల్యూటీసీ,  వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ట్రావిస్ హెడ్..   అశ్విన్‌‌‌‌‌‌‌‌, జో రూట్‌‌‌‌‌‌‌‌తో పాటు మెన్స్ టెస్ట్ క్రికెటర్ అవార్డుకు షార్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్ అయ్యారు.  కాగా, అశ్విన్ గతేడాది టెస్టుల్లో  41 వికెట్లు పడగొట్టాడు.