గ్లోబల్ సిటీల టాప్-5 లిస్టులో హైదరాబాద్.. బెంగళూరు ఫస్ట్!

గ్లోబల్ సిటీల టాప్-5 లిస్టులో హైదరాబాద్.. బెంగళూరు ఫస్ట్!

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా బెంగళూరు మెుదటి స్థానంలో నిలిచింది2024 Savills Growth Hubs Index రిపోర్ట్ ప్రకారం. ప్రపంచంలోని 230 నగరాలపై ఆర్థిక వృద్ధి, జనాభా పెరుగుదల, వ్యక్తిగత సంపద ఆధారంగా నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ గ్లోబల్ స్టడీ 2033 వరకు బెంగళూరు తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని పేర్కొంది.

భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం.. ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్స్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను ఆకర్షిస్తోంది. ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు నైపుణ్యవంతులైన వర్క్‌ఫోర్స్, కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఈ నగర అభివృద్ధికి దోహదం చేస్తోందని తేలింది. ఐటీ పార్కులు, ఉద్యోగులు, పెట్టుబడులు పెరగడం దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-5 నగరాల్లో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై లాంటి ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకోవటం గమనార్హం. 

ప్రస్తుతం గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ గా మారిన హైదరాబాద్ ఈ లిస్టులో 4వ స్థానంలో దక్కించుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ 3వ స్థానంలో ఉండగా.. ఆర్థిక రాజధాని ముంబై 5వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రధానంగా టెక్ అండ్ సర్వీస్ పవర హౌస్ గా ఉందని నివేదిక వెల్లడించింది. ఢిల్లీ మాత్రం జన సాంద్రత, ఆర్థిక వృద్ధితో లిస్టులో చేరగా.. ముంబై ఫైనాన్స్, ట్రేడ్, రియల్ ఎస్టేట్ కారణంగా ముందుకు నడపబడుతున్నట్లు తేలింది. 

హైదరాబాదును గ్రోత్ స్టోరీ ఇలా.. 

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందున నాల్గవ నగరంగా హైదరాబాద్ నిలిచింది. నగరంలో పెరుగుతున్న టెక్ అండ్ సర్వీస్ హబ్స్, ప్రణాళికాపరమైన నగర విస్తరణ, పెరుగుతున్న డిజిటల్ ఇన్ ఫ్రా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రధాన గ్రోత్ ఇంజన్లుగా నిలుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దీంతో పెట్టుబడిదారులతో పాటు టూరిస్టులను కూడా నగరం ఆకర్షిస్తోందని వెల్లడైంది. 

ప్రపంచ వ్యాప్తంగా15 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 14 ఆసియాలో ఉండటం గమనార్హం. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68% కంటే ఎక్కువ నగరీకరణ విభాగాల్లో జీవిస్తారని అంచనా. ఈ సందర్భంలో భారత నగరాల ప్రాధాన్యత మరింత పెరుగుతుందని తెలుస్తోంది.