భారత విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విధానమే: ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు..

భారత విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విధానమే: ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు..

పశ్చిమ ఆసియాలో (West Asia) జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ విదేశాంగ విధానం కాస్తా  మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా మారిపోయిందని అన్నారు.

రాహుల్ గాంధీ విమర్శ 
 ప్రస్తుత విదేశాంగ విధానాన్ని ప్రపంచమంతా చూసి నవ్వుకుంటోందని, ఇది ఒక పెద్ద జోక్  లాగా తయారైందని రాహుల్ విమర్శించారు. ప్రధాని  వ్యక్తిగత నిర్ణయాల కోసం దేశ ప్రతిష్టను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.

 పశ్చిమ ఆసియా సంక్షోభం గురించి పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధాని మోదీ కోవిడ్-19 అంశాన్ని తీసుకురావడాన్ని రాహుల్ తప్పుబట్టారు. కరోనా సమయంలో జరిగిన మరణాలు, ప్రజలు పడ్డ కష్టాలను ప్రధాని మర్చిపోయి మాట్లాడుతున్నారని  అన్నారు.

►ALSO READ | ఈ గ్యాస్ కష్టాల్లోనూ.. ఫ్రీ సిలిండర్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఇదే..!

 ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ.. మన దేశ విదేశాంగ విధానం బలహీనపడిందని, ప్రధాని రాజీపడటం వల్లే దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మొత్తంగా, విదేశీ వ్యవహారాల్లో భారతదేశం తన పట్టు కోల్పోతోందని, ఇది కేవలం మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే సాగుతోందని ప్రతిపక్ష నేతగా తన నిరసనను వ్యక్తం చేశారు.