న్యూఢిల్లీ: వెయిట్ లిఫ్టింగ్‌లో దూసుకెళ్తున్న ఇండియా యువ లిఫ్టర్ హర్షదా గరుడ్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో సత్తా చాటింది. తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. 18 ఏళ్ల హర్షద సోమవారం రాత్రి జరిగిన విమెన్స్ 45 కేజీల ఈవెంట్‌లో మొత్తం 157 కిలోల (స్నాచ్ 69+ క్లీన్ అండ్ జర్క్ 88) బరువెత్తి అగ్రస్థానం సాధించింది. ఇదే ఈవెంట్‌లో ఇండియాకు చెందిన సౌమ్యా దాల్వి 145 (63+82) కిలోలతో మూడో స్థానంతో బ్రాంజ్ గెలిచింది. ఇక, మెన్స్ 49 కేజీ కేటగిరీలో ఎల్. ధనుశ్ స్నాచ్ సెక్షన్‌లో 85 కేజీలతో బ్రాంజ్ నెగ్గాడు. ఓవరాల్ గా మాత్రం 185 (85+100) కేజీలతో నాలుగో స్థానంతో సరిపెట్టాడు. కాంటినెంటల్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో క్లీన్ అండ్ జర్క్, స్నాచ్‌తో పాటు మొత్తం లిఫ్ట్‌కు సపరేట్‌గా మెడల్స్ ఇస్తారు. ఒలింపిక్స్‌లో అయితే మొత్తం లిఫ్ట్‌కు మాత్రమే పతకం అందజేస్తారు.
