ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్

ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లకు షాకిచ్చాడు. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి అందరినీ హడలెత్తించాడు. గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 10న ఇండిగో విమానం చెన్నై నుంచి తిరుచిరపల్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. ప్లైట్ టేకాఫ్ కు రెడీ అవుతుండగా.. ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు. దీంతో మిగిలిన ప్రయాణికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. ఫ్లైట్ టేకాఫ్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్యాబిన్ క్రూ ప్యాసింజర్లకు భరోసా ఇచ్చిన అనంతరం విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.