ఇండిగో ఈజీఎంలో రభస

ఇండిగో ఈజీఎంలో రభస

ఎదురు తిరిగిన షేర్‌‌‌‌ హోల్డర్స్
మీటింగ్​కు రాని గంగ్వాల్

ఇంటర్‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్‌‌ సంస్థ షేర్‌‌‌‌హోల్డర్స్‌‌ ప్రమోటర్లకు ఎదురు తిరిగారు.  ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌‌లో కో ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ ప్రతిపాదించిన తీర్మానాన్ని షేర్‌‌‌‌హోల్డర్స్‌‌ తిరస్కరించారు. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజీల ఫైలింగ్‌‌లో వెల్లడించింది. గంగ్వాల్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలతో, కో ప్రమోటర్ రాహుల్ భాటియాకు చెందిన గ్రూప్‌‌కున్న వీటో పవర్స్‌‌ అన్నీ పోతాయి. అంటే గంగ్వాల్‌‌ తన షేర్లను అమ్మాలనుకుంటే, రాహుల్ భాటియా పర్మిషన్ లేకుండానే అమ్మేసుకోవచ్చు. ఆయన నుంచి ఎలాంటి లిటిగేషన్స్ రాకుండా.. గంగ్వాల్‌‌ ఈ ప్రతిపాదనను తెచ్చారు. అయితే ఈ సవరణలను చేయడానికి ఎంత మాత్రం ఒప్పుకోవడానికి లేదంటూ షేర్‌‌‌‌హోల్డర్స్ వీటిని తోసిపుచ్చారు. ఈ స్పెషల్ రిజొల్యూషన్‌‌కు వ్యతిరేకంగా 51.11 శాతం ఓట్లు పడ్డాయి. కేవలం 48.56 శాతం ఓట్లే దీనికి అనుకూలంగా వచ్చినట్టు కంపెనీ ఎక్స్చేంజీల ఫైలింగ్‌‌లో తెలిపింది. ఈ స్పెషల్ రిజొల్యూషన్‌‌ను ఆమోదించడానికే, గంగ్వాల్,  ఆయన సంస్థలు కలిసి ఎక్స్‌‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్(ఈజీఎం)ను నిర్వహించాయి. ఈ రిజొల్యూషన్ ఆమోదం పొందడానికి 75 శాతం ఓట్లు కావాలి.

ఈజీఎంలో హైడ్రామా…

మరోవైపు ఈజీఎంకు పిలిచిన గంగ్వాలే.. ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో షేర్‌‌‌‌హోల్డర్స్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సేపు పాటు ఇండిగో ఈజీఎంలో పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది.  స్టేజీపై నెలకొన్న గొడవను అదుపులోకి తేవడానికి, ప్రమోటింగ్ ఛైర్మన్ ఎన్ దామోదరన్‌‌ సెక్యురిటీ గార్డులను పిలిచి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ప్రమోటర్ల గొడవలతో చేటు!

కో ప్రమోటర్లు గంగ్వాల్‌‌, భాటియాల మధ్యనున్న గొడవలు.. కంపెనీలో షేర్‌‌‌‌హోల్డర్స్‌‌కు చేటు తెస్తున్నాయని, షేర్ ధర హరించుకుపోతుందని మైనార్టీ షేర్ హోల్డర్స్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత లేదని వాపోయారు. దీంతో తమ రిటర్న్‌‌లపై ప్రభావం పడుతోందని.. బాటియా కనీసం దీనిపై ఏం మాట్లాడటం లేదని షేర్‌‌‌‌ హోల్డర్స్‌‌లో ఒకరు అన్నారు.  రిజొల్యూషన్‌‌లో గంగ్వాల్ షేర్లను అమ్మాలనుకుంటున్నారా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈజీఎంకు పిలిచారు. ఈజీఎంకు పిలిచిన గంగ్వాల్ కనీసం మీటింగ్‌‌కు కూడా రాలేదని జస్మిత్ సింగ్ అనే షేర్‌‌‌‌హోల్డర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగ్వాల్‌‌ మీటింగ్‌‌కు ఎందుకు రాలేదో కారణం తమకు తెలియదని, భాటియాకు చెందిన ఇంటర్‌‌‌‌గ్లోబ్ ఎంటర్‌‌‌‌ప్రైజ్ గ్రూప్ అధికార ప్రతినిధి చెప్పారు.

ఏడాది కాలంగా సర్దుకోని గొడవలు…

గంగ్వాల్, భాటియాల మధ్య గత ఏడాది కాలంగా సాగుతోన్న గొడవ తెలిసిందే. షేర్ హోల్డర్స్ రైట్స్, ఛైర్మన్ ఎంపిక, నియామకం, మేనేజ్‌‌మెంట్‌‌లో అధికారులను నియమించుకోవడం ఇలా చాలా విషయాలపై గొడవలు వస్తున్నాయి. భాటియా తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని గంగ్వాల్‌‌ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?