ఇందిరా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఇందిరా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

 మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పై కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు కాంగ్రెస్ నాయకుడు సంజయ్ గాంధీ గోహత్యతో శాపానికి గురయ్యారని అన్నారు.  గోహత్యలు చేయడంతోనే వీరు చనిపోయారని చెప్పారు.   సన్యాసి కర్పాత్రి మహారాజ్ చేసిన శాపం ఫలితంగా గోపాష్టమి రోజున ఇందిరా గాంధీని కాల్చి చంపారని అన్నారు. కర్ణాటకలోని కుంటలో  జరిగిన ఓ కార్యక్రమంలో హెగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గోహత్య నిషేధంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని ఉద్యమంలో డజన్ల కొద్దీ సాధువులు మరణించారని అనంత్ కుమార్ చెప్పారు.  ఇందిరా గాంధీ సమక్షంలో గోవులు వధించబడ్డాయని ఆవులను కూడా కాల్చి చంపారని ఆరోపించారు. గొప్ప సన్యాసి కర్పాత్రి మహారాజ్ ఇందిరా గాంధీని శపించాడని అందుకే ఇందిరా గాంధీ గోపాష్టమి రోజు చనిపోయిందని అన్నారు.
  
బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే రాజకీయ ప్రయోజనాల కోసం వాడిన భాష ఆయన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన అనంత్ కుమార్ హెగ్డే నుంచి మంచి సంస్కృతిని ఆశించడం సాధ్యమేనా అని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిని కొందరు గౌరవిస్తారు, మరికొందరు గౌరవించరు. వారు రాజకీయంగా అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తే, అది వారి పరువుకు భంగం కలిగిస్తుందని తనకి కాదని సిద్ధరామయ్య చెప్పారు.