కూసుమంచి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ ఎండీ పీవీ.గౌతమ్ సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఐతగాని కవిత, చిన్నపొంగు గోవర్దన్‌తో మాట్లాడారు.
ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది ? అని తెలుసుకున్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈలు రవి, వెంకటేశ్, కార్యదర్శి రాజేశ్, సర్పంచ్ వెంకట్‌రమణ, ఉప సర్పంచ నల్లమల్ల శేఖర్‌రావు ఉన్నారు.
