ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ

ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ

మేడిపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్​లోని 27, 28 డివిజన్లలో 40 మంది లబ్ధిదారులకు శనివారం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కమిషనర్ శైలజతో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. 

అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు ప్రభుత్వ నియమాలను అనుసరించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. హౌసింగ్ ఏఈ అల్లాజీ, మాజీ కార్పొరేటర్లు పోగుల నరసింహ రెడ్డి, కొత్త చందర్ గౌడ్, చీరాల నరసింహ, బందారం శ్రీధర్ గౌడ్, సుమన్ నాయక్ పాల్గొన్నారు.