
గుడిహత్నూర్(ఇంద్రవెల్లి), వెలుగు: సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నెరవేరుతోందని కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గొడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో 349 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్లను నాణ్యతతో కట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్, అధికారులు, మండల కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.