- ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ
- నల్గొండలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలోని కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. నియోజకవర్గానికి రూ 2. 20 కోట్లతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైస్ మిల్లుల బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరలకు, ప్రస్తుతం 65 లక్షలు వచ్చాయన్నారు. మరో 35 లక్షలు రాగానే పట్టణాల్లోని మహిళలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇందిరా మహిళల శక్తి చీరల పంపిణీలో 4.20 లక్షల చీరలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఇన్‌చార్జి డీఆర్ఓ అశోక్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శేఖర్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి , మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిట్యాల, నార్కట్ పల్లి/ వెలుగు: మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం తెలంగాణ ప్రగతి ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మండలంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్రా వినోదం మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాటం వెంకటేశం, పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ, వెలుగు: మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆర్డీవో రమణారెడ్డి ,పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్లు పాల్గొన్నారు.
హాలియా, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో మహిళా సాధికారిత కు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాగర్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్‌లో నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలు ఇచ్చిన సపోర్టే కారణమన్నారు. నియోజకవర్గంలో 65 వేల మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో మహిళా శక్తి పెట్రోల్ బంక్ మంజూరు అయిందని త్వరలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై స్పష్టత ఇస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
