సిన్సినాటీ మేయర్గా మరోసారి అఫ్తాబ్

సిన్సినాటీ మేయర్గా మరోసారి అఫ్తాబ్

న్యూయార్క్: ఓహియోలోని సిన్సినాటీ సిటీ మేయర్ గా భారత సంతతి వ్యక్తి అఫ్తాబ్ ఫురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికలో ఆయన డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సోదరుడు, రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బౌమన్ ను ఓడించారు. సిన్సినాటీలో స్థానికంగా డెమోక్రట్లకు గట్టి పట్టుంది. ఫురేవాల్ విజయం స్థానిక ప్రభుత్వంపై డెమోక్రాట్ల నియంత్రణను మరింత పెంచనుంది. మేయర్ పదవికి ఓపెన్ ప్రైమరీ ఎన్నికలు మేలో జరగగా.. ఫురేవాల్ దాదాపుగా 80% ఓట్లతో కోరీ బౌమన్ ను ఓడించారు. ప్రైమరీలో ఈ ఇద్దరూ అత్యధిక ఓట్లు సాధించడంతో తాజాగా మేయర్ పీఠానికి పోటీపడ్డారు. 43 ఏండ్ల ఫురేవాల్ మాజీ స్పెషల్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పని చేశారు. 2021లో మొదటిసారి 66% ఓట్లను సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఫురేవాల్ తల్లి టిబెటన్ శరణార్థి. చిన్నతనంలోనే చైనా నుంచి పారిపోయి వచ్చి దక్షిణ భారత శరణార్థి శిబిరంలో పెరిగారు. అతడి తండ్రి పంజాబీ. ఫురేవాల్ 2015లో తొలిసారిగా హామిల్టన్ కౌంటీ క్లర్క్ కోర్ట్స్ కు పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి కోరీ బౌమన్ కు ఎటువంటి పొలిటికల్ ట్రాక్ రికార్డు లేదు. బౌమన్ ఎన్నికల ప్రచారానికి జేడీ వాన్స్ దూరంగా ఉన్నారు.