IPO News: చిల్లిగవ్వ లాభం ఇవ్వని ఐపీవో.. మెుదటి రోజే ఇన్వెస్టర్స్ షాక్.. మరి కొనాలా? అమ్మాలా?

IPO News: చిల్లిగవ్వ లాభం ఇవ్వని ఐపీవో.. మెుదటి రోజే ఇన్వెస్టర్స్ షాక్.. మరి కొనాలా? అమ్మాలా?

Indogulf Cropsciences IPO: దేశీయ స్టాక్ మార్కెట్లోకి 2025లో అనేక ఐపీవోలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పెట్టుబడిదారుల నుంచి భారీగా కోలాహలం, బెట్టింగ్ జోరు కనిపిస్తున్నప్పటికీ చాలా ఐపీవోలు మాత్రం తక్కువ లాభాలు లేదా ఫ్లాట్ లిస్టింగ్స్ నమోదు చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. భారీగా కనిపిస్తున్న డిమాండ్ లాభాలుగా మారకపోవటంపై ఇన్వెస్టర్లు అసంతృప్తిగా ఉన్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీ కింద వచ్చిన ఐపీవో నేను స్టాక్ మార్కెట్లలో ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేసింది. అయితే ఉదయం 10.33 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.111గా ఉండగా.. బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ.110 దగ్గర కొనసాగుతోంది. గ్రేమార్కెట్లో లాభాలు పలికిన ఐపీవో వాస్తవ లిస్టింగ్ రోజున ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవటం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది. 

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.200 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం కంపెనీ ఐపీవో జూన్ 26 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.105 నుంచి రూ.111గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 135 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.14వేల 175 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అలాగై కంపెనీ షేర్లకు 35 రెట్లు అధిక బిడ్లు వచ్చాయి.

కంపెనీ వ్యాపారం..
ఇండోగల్ఫ్ సంస్థ 1993లో స్థాపించబడింది. ఇది పంట రక్షణ, మెుక్కలకు అవసరమైన న్యూట్రిషన్, బయోలాజిక్స్ వ్యాపారంలో కొనసాగుతోంది. కంపెనీకి జమ్మూలోని సాంబా, హర్యాణాలోని నతుపూర్ తో పాటు మెుత్తం నాలుగు ఉత్పత్తి ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో వ్యాపారాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రస్తుతం సమీకరించిన డబ్బును వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రుణ చెల్లింపులకు అలాగే కొత్త యంత్రాల కొనుగోలు కోసం వినియోగించాలని నిర్ణయించింది. 

కంపెనీ షేర్లపై నిపుణుల మాట..
నేడు కంపెనీ షేర్లు ఫ్లాట్ లిస్టింగ్ తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లలో ఈ స్టాక్ కొనాలా అమ్మేయాలా లేక హోల్డ్ చేయాలా అనే అయోమయం కొనసాగుతోంది. అయితే దీనిపై ఆనంద్ రాఠీ ప్రతినిధి నరేంద్ర సోలంకి మాట్లాడుతూ దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ తర్వాత షేర్లను హోల్డ్ చేయటం ఉత్తమం అని సూచించారు. అగ్రి వ్యాపారంలో ఉన్న కంపెనీ ప్రభుత్వ చర్యలతో పాటు పెరుగుతున్న ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి పరిణామాలకు అనుగుణంగా ప్రభావితం అవుతుందని బ్రోకరేజ్ వెల్లడించింది.