
బోధన్, వెలుగు : ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించి.. పర్యావరణాన్ని కాపాడాలని ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ పిలుపునిచ్చారు. శనివారం బోధన్ పట్టణంలోని ఇందూర్ స్కూల్ప్లాస్టిక్నివారణ, పర్యావరణ రహిత వస్తువుల వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఎకో క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఆచన్‌పల్లిలో ర్యాలీ నిర్వహించి పట్టణవాసులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు పాత వస్తువులతో తయారు చేసిన 400 సంచులను ఆచన్‌పల్లి, బైపాస్ రోడ్డు, ఆచన్‌పల్లి వీధుల్లో తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌వల్ల జరిగే అనర్థాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన 15 మంది విద్యార్థులకు బహుమతులు, పూల మొక్కలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్వాతి, హెచ్ఎం రామారావు, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.