గులాబి కండువాతో బూత్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి..బీజేపీ కార్యకర్తల ఆందోళన

గులాబి కండువాతో బూత్ లోకి  ఇంద్రకరణ్ రెడ్డి..బీజేపీ కార్యకర్తల ఆందోళన

రాష్ట్ర మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లగించారలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

నిర్మల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని మంజులాపూర్ 19 వార్డు పోలింగ్ బూత్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువా వేసుకొని వెళ్లారని బీజేపీ కార్యకర్తులు   ఆరోపిస్తూ..  ఆయన బూత్ లోపలికి వెళ్లడాన్ని  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలని చెదరగొట్టారు.