రూ.12 కోట్లతో మేడారం అభివృద్ధి : ఇంద్రకరణ్ ‌‌‌‌రెడ్డి

రూ.12 కోట్లతో మేడారం అభివృద్ధి :  ఇంద్రకరణ్ ‌‌‌‌రెడ్డి
  • ఫిబ్రవరిలోగా కంప్లీట్ ‌‌‌‌ చేసేలా చర్యలు తీసుకుంటాం

హనుమకొండ, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆ పనులన్నీ ఫిబ్రవరిలోగా కంప్లీట్ ‌‌‌‌ చేస్తామన్నారు. వరంగల్ ‌‌‌‌ సెంట్రల్ ‌‌‌‌ జైల్ ‌‌‌‌ స్థలం ఎదురుగా రూ.4.16 కోట్లతో నిర్మించిన ధార్మిక భవన్ ‌‌‌‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ ‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ ‌‌‌‌కుమార్ ‌‌‌‌, చీప్ ‌‌‌‌ విప్ ‌‌‌‌ వినయ్ ‌‌‌‌ భాస్కర్ ‌‌‌‌తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరకు ఏటా కోటి మందికిపైగా వస్తుంటారన్నారు. అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరాను నేషనల్​ ఫెస్టివల్​గా గుర్తించాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

మేడారం జాతరకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనులు చేస్తోందన్నారు. సుమారు రూ.12 కోట్లతో డార్మెటరీ, అదనపు గదులు, ఆఫీస్ ‌‌‌‌లు, ఆఫీసర్ల రూమ్స్ ‌‌‌‌, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ‌‌‌‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ‌‌‌‌ పాలనలో ఒక్క గుడిని కూడా పట్టించుకోలేదన్నారు. అప్పట్లో పూజారులకు జీతాలు లేక ఇబ్బంది పడేవారని, తెలంగాణ వచ్చాక ధూపదీప నైవేద్యం కింద జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. 

భద్రాచలం, అయోధ్య కంటే వల్మిడికి ఎక్కువ చరిత్ర ఉందని, సుమారు రూ.100 కోట్లతో డెవలప్ ‌‌‌‌ చేశామని చెప్పారు. అంతకుముందు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ ‌‌‌‌ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ‌‌‌‌ బండ ప్రకాశ్ ‌‌‌‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ ‌‌‌‌ గుండు సుధారాణి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, కలెక్టర్ ‌‌‌‌ సిక్తా పట్నాయక్ ‌‌‌‌ పాల్గొన్నారు. 

కాంగ్రెస్ ‌‌‌‌ లీడర్లవి ప్రచార ఆర్భాటాలే... 

జయశంకర్ ‌‌‌‌ ‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : దేశంలో కాంగ్రెస్ ‌‌‌‌ పార్టీకే గ్యారంటీ లేదు,  అలాంటిది ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మడం లేదని మంత్రులు సత్యవతి రాథోడ్ ‌‌‌‌, ఇంద్రకరణ్ ‌‌‌‌ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా మేడారంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ‌‌‌‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్ ‌‌‌‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుచేయడం లేదన్నారు. మహిళలకు రూ. 2 వేలు,  గ్యాస్ ‌‌‌‌ ధర రూ. 500, స్టూడెంట్లకు రూ. ఐదు లక్షలు అని ప్రకటిస్తున్న కాంగ్రెస్ ‌‌‌‌ స్టూడెంట్ల అకౌంట్లలో రూ. 5 కూడా జమ చేయదన్నారు. 

కాంగ్రెస్ ‌‌‌‌ దొంగ హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ ‌‌‌‌ఎస్ ‌‌‌‌ అధికారంలోకి రావడం, కేసీఆర్ ‌‌‌‌ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంగా ఉన్న ములుగును అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ ‌‌‌‌కే దక్కుతుందన్నారు. ములుగును జిల్లాగా ప్రకటించడం వల్ల ఇక్కడ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ జిల్లాపై ఐటీ మంత్రి కేటీఆర్ ‌‌‌‌ సైతం ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ములుగు అసెంబ్లీ క్యాండిడేట్ ‌‌‌‌గా బడే నాగజ్యోతిని ప్రకటించడంతో కాంగ్రెస్ ‌‌‌‌ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 

స్థానిక ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటమే తప్ప పైసా పని చేయలేదని ఎద్దేవా చేసారు. ములుగు నియోజకవర్గంలోని 9 మండలాలకు ఇన్ ‌‌‌‌చార్జులను నియమించామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సూచించారు. ములుగు మెడికల్ ‌‌‌‌ కాలేజీ నిర్మాణ పనులకు ఈ నెల 28న మంత్రి హరీశ్ ‌‌‌‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. బీఆర్ ‌‌‌‌ఎస్ ‌‌‌‌ క్యాండిడేట్ ‌‌‌‌ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.