స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌లో విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల జోరు

స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌లో విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల జోరు

న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.30 వేల  కోట్లను స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. డాలర్ మారకంలో రూపాయి స్టేబుల్ అవ్వడం, ఇతర దేశాలతో పోలిస్తే దేశ ఎకానమీ మెరుగ్గా ఉండడంతో విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల ఇన్‌‌‌‌ఫ్లో కొనసాగుతోంది. కానీ, ముందుకెళ్లే కొద్దీ  ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌పీఐ) ఇన్‌‌‌‌ఫ్లోస్ వేగం తగ్గుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ స్ట్రాటజిస్ట్‌‌‌‌ వీకే విజయకుమార్ అన్నారు.

మార్కెట్ హై వాల్యుయేషన్‌‌‌‌లో ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం ఇండియాతో పోలిస్తే చైనా, సౌత్ కొరియా, తైవాన్‌‌‌‌ స్టాక్ మార్కెట్‌‌‌‌లు ఆకర్షణీయంగా ఉన్నాయని, ఎఫ్‌‌‌‌పీఐలు ఈ మార్కెట్‌‌‌‌లకు వెళ్లడం పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. డిపాజటరీల  డేటా ప్రకారం, ఈ నెల 1 నుంచి 18 మధ్య దేశ ఈక్విటీ మార్కెట్‌‌‌‌లో రూ. 30,385 కోట్లను ఎఫ్‌‌‌‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు.  

కిందటి నెలలో నికరంగా రూ.8 కోట్లను బయటకు తీసేయగా, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రూ. 7,624 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. ఈ రెండు నెలలకు ముందు ఎఫ్‌‌‌‌పీఐలు మార్కెట్‌‌‌‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు, జులైలో రూ.5,000  కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకంటే ముందు వరసగా తొమ్మిది నెలల పాటు నికర అమ్మకం దారులుగా  ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే  స్టాక్ మార్కెట్‌‌‌‌ నుంచి  నికరంగా  రూ.1.4 కోట్ల విలువైన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను విదేశీ ఇన్వెస్టర్లు బయటకు తీశారు.