వీడియో కోసం కుక్కను తన్నిన యువతిపై నెటిజన్ల ఫైర్

వీడియో కోసం కుక్కను తన్నిన యువతిపై నెటిజన్ల ఫైర్

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ పాపులర్ కావలన్న కోరిక మరింత పెరిగిపోయింది. ఈ అత్యుత్సాహంతో కొంతమంది తామేం చేస్తున్నారో కూడా మరిచిపోతున్నారు. దాని కోసం రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. మంచి చెస్తే పర్లేదు... మంచి కాకపోయినా చెడు చేయకూడదు కదా... కానీ కొందరు ఆ ఇంగిత జ్ఞానం మరచిపోయి, లైకులు, ఫాలోవర్లు, వ్యూస్ కోసం మానవత్వా్న్ని కూడా కోల్పోతున్నారు. దానికి ఉదాహరణే ఈ వీడియో. 

ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ లో రీల్ చేయడం కోసం కుక్కను తన్నింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను సేవ్ ఏ స్ట్రే వ్యవస్థాపకుడు విదిత్ శర్మ షేర్ చేశారు. గొంతు లేని మూగ జీవాల పట్ల మీరు ఎంత ప్రేమను కనబరుస్తారు అని ఈ సందర్భంగా ఆయన రాసుకొచ్చారు. దాంతో పాటు మీరు ప్రేమించకపోయినా పర్లేదు గానీ... బాధ కల్గించొద్దని ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రీల్ చేసిన ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ యువతి క్షమాపణలు చెప్పింది.