చెట్టు నుంచి బుల్లెట్స్ రావడమేంటి?

చెట్టు నుంచి బుల్లెట్స్ రావడమేంటి?

చెట్టు నుంచి బుల్లెట్స్ రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ అది నిజమే. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌‌‌‌లో పెరిగే ‘శాండ్‌‌‌‌బాక్స్’ అనే చెట్టు విత్తనాలు బాంబుల్లా పేలతాయి. వాటి విత్తనాలు నేలపై కాకుండా గాలిలో బుల్లెట్లలా దూసుకువస్తాయి. వంద అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టుకి దగ్గర్లో ఎవరైనా ఉంటే ఆ బుల్లెట్ల ధాటికి చనిపోవడం ఖాయం. అందుకే ఈ చెట్టుని ‘డైనమైట్ ట్రీ’ అని పిలుస్తారు. శాండ్‌‌‌‌బాక్స్ ట్రీ ప్రపంచంలోనే ప్రమాదకరమైన, భయంకరమైన చెట్టు. ఇది మనుషులను సునాయాసంగా చంపగలదు.

ఈ చెట్టు కాండానికి ముళ్ల రూపంలో మొగ్గలు వస్తాయి. ఈ ముళ్ల నుంచి కాయలు కాస్తాయి. ఈ కాయలు చూడ్డానికి గుమ్మడికాయల్లా ఉంటాయి. కానీ వాటి నుంచి వచ్చే విత్తనాలు మాత్రం అత్యంత ప్రమాదకరం. చెట్టు పూతకు వచ్చినప్పుడు ఈ విత్తనాలు నేలమీద పడకుండా  చెట్టుకు అన్నివైపులా సమాంతరంగా దూసుకెళ్తాయి. ఎంతో విషపూరితమైన ఈ విత్తనాలు మనుషులకు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ చెట్టుని ఎక్కడం కూడా దాదాపు అసాధ్యం. కోతుల్లాంటి జంతువులు కూడా ఈ చెట్టుని ఎక్కలేవు. దీన్ని ‘డెడ్లియెస్ట్ ట్రీ’, ‘ఫ్రూట్ బాంబ్’ ట్రీ అని కూడా అంటారు.