ఇన్ఫీ లాభం రూ. 4,110 కోట్లు

ఇన్ఫీ లాభం రూ. 4,110 కోట్లు

బెంగళూరు: దేశంలోని రెండో పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌‌ షేర్‌‌కి రూ. 8 చొప్పున ఇంటరిమ్‌‌ డివిడెండ్‌‌ ప్రకటించింది. రెండో క్వార్టర్‌‌కు కంపెనీ ఆర్థిక ఫలితాలు ఎనలిస్టుల అంచనాలకు దగ్గరగానే ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన క్వార్టర్ల ఫలితాలు ఇంకొంచం మెరుగ్గా ఉండొచ్చనే సంకేతాలనూ ఇన్ఫోసిస్‌‌ వెల్లడించింది. సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో క్వార్టర్లో కంపెనీ నికరలాభం అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్‌‌తో పోలిస్తే 2.21 శాతం తగ్గి రూ. 4,110 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలానికి మొత్తం ఆదాయం రూ. 21,348 కోట్ల నుంచి రూ. 23,255 కోట్లకు పెరిగింది.

రిజల్ట్స్‌‌ హైలైట్స్‌‌

అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్‌‌తో పోలిస్తే ఈ ఏడాది రెండో క్వార్టర్లో రెవెన్యూ 9.9 శాతం పెరిగింది. కరెన్సీ స్థిర విలువ వద్ద ఈ ఎర్నింగ్స్‌‌ 11.4 శాతం పెరిగాయి.
మొదటి క్వార్టర్‌‌తో పోలిస్తే రెవెన్యూ వృద్ధి 2.5 శాతం.
డిజిటల్‌‌ రెవెన్యూ రూ. 8,740 కోట్లు. మొత్తం రెవెన్యూలో వీటి వాటా 38.3 శాతం.
ఆపరేటింగ్‌‌ మార్జిన్‌‌ మొదటి క్వార్టర్‌‌తో పోలిస్తే 1.2 శాతం పెరిగి 21.7 శాతానికి చేరింది.
ఆరు నెలలకూ రెవెన్యూ వృద్ధి 11.9 శాతం. ఆపరేటింగ్‌‌ మార్జిన్‌‌ 21.1 శాతం.
ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన కాలానికి రెవెన్యూ వృద్ధి 9–10 శాతం ఉండొచ్చని, ఆపరేటింగ్‌‌ మార్జిన్ 21–23 శాతంగా ఉంటుందని గైడెన్స్‌‌ ఇచ్చింది.

సెప్టెంబర్‌‌ 2019 క్వార్టర్లో రెవెన్యూ, డిజిటల్‌‌, ఆపరేటింగ్‌ మార్జిన్లు, ఆపరేషనల్‌‌ ఎఫిషియెన్సీ మెరుగయ్యాయి. పెద్ద డీల్స్‌ సంతకాలు చేశాం. ఉద్యోగుల వలసా తగ్గింది. ఇవన్నీ కలిపి చూస్తే మేం సరైన దారిలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. – సలీల్‌‌ పారిఖ్‌‌, సీఈఓ