Infosys : ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా

Infosys : ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇన్ఫోసిస్ కంపెనీలో  ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపారాలకు బాధ్యత వహించారు. దాంతో పాటు అదనంగా  ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా, మా గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫినాకిల్‌ సాఫ్ట్‌వేర్ వ్యాపారానికి నాయకత్వం వహించారు. జోషి మార్చి 11వ తేదీ నుంచి సెలవుల్లో ఉంటారని, కంపెనీలో అతని చివరి వర్కింగ్ డే జూన్ 9. 2023 అని  కంపెనీ వెల్లడించింది.

కంపెనీలో మోహిత్ జోషి అందించిన సేవలకు, కంపెనీకి ఆయన చేసిన సేవలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నుంచి జోషి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. జోషి ఇన్ఫోసిస్ లో 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రవి కుమార్ కంపెనీని విడిచిపెట్టిన తర్వాత.. ఇన్ఫోసిస్ కు జోషి రాజీనామా చేయడం అతిపెద్ద నిష్ర్కమణ అని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసిన జోషి.. త్వరలోనే టెక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.