ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా

ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా

ప్రముఖ సాప్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించనుంది. వీసా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దానికి సంబంధించిన పన్ను అవకతవకలకు పాల్పడినందుకు 8లక్షల డాలర్లు(రూ.565కోట్లు) జరిమానా విధించినట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ తెలిపారు. 2006-2017వరకు దాదాపు 500 మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ H-1B వీసాకు బదులు B-1 వీసాపై కాలిఫోర్నియాకు పంపించింది. తద్వారా అక్కడి వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టయింది. H-1B వీసాలపై పరిమితి ఉండటం, ఆ వీసాపై వచ్చే ఉద్యోగులకు అక్కడి ప్రమాణాల ప్రకారం వేతనం చెల్లించాల్సి ఉండటంతో ఇన్ఫోసిస్ B-1 వీసాపై ఉద్యోగులను అక్కడికి తరలించిందన్న ఆరోపణలున్నాయి. గతంలో సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగి దీనిపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించారు. ఇన్ఫోసిస్ అవకతకవలు బయటపడటంతో ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించేందుకు సంస్థ ఒప్పుకుంది.